ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీ అక్రమ పొత్తులు పెట్టుకున్నాయన్నారు. నంబూరు వసంతకుమారి
నారదవర్తమానసమాచారం:అమరావతి:ప్రతినిధి
ఎంతమంది కలిసి వచ్చినా.. జగనన్న సైన్యం ముందు నిలబడలేరన్నారు.
పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు సతీమణి వసంత కుమారి
అమరావతి మండలం ఎండ్రాయి, నరుకుళ్లపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం.
రాబోయే ఎన్నికల్లో జగనన్న జెండా ఎగరేద్దామని నంబూరు వసంత కుమారి అన్నారు. అమరావతి మండలం ఎండ్రాయి, నరుకుళ్లపాడు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సతీమణి వసంత కుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కరపత్ర రూపంలో ప్రతి ఇంటికి అందజేశారు. పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీ అక్రమ పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా.. జగనన్న సైన్యం ముందు నిలబడలేరన్నారు. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న వారిని ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పెదకూరపాడులో ఈసారి భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.