
వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది.
నారదవర్తమానసమాచారం:తెలంగాణ:ప్రతినిధి
ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది.
ఇంకా 51.5 శాతం డీఏ బకాయి ఉండగా.. దానిని 43.2 శాతం వద్ద స్థిరీకరించింది.
వేతన సవరణ అనంతరం వచ్చే మూల వేతనంపై 43.2 శాతం డీఏను లెక్కించి జీతంతోపాటు చెల్లించనున్నారు.