
ఆంద్రప్రదేశ్
ఇబ్రహీంపట్నం మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాకి ప్రభాకర్ భార్య కాకి రోజా ఇటీవల మరణించారు.
నారద వర్తమాన సమాచారం. ఇబ్రహీంపట్నం ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో నేడు మంగళవారం కాకి రోజా ఆమె దశదినకర్మ సందర్భంగా మైలవరం నియోజకవర్గ బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇదిలా ఉండగా ఇటీవల కొంక నెహ్రూ కుమారుడు మరణించగా వారి కుటుంబ సభ్యులను మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరామర్శించారు.ఈ కార్యక్రమంలో జంపాల సీతారామయ్య , మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి శ్రీనివాసరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకి నాగరాజు, మూరకొండ నాగేశ్వరావు, గంజి ఏసుబాబు , అబ్బూరి విష్ణు, అమర్లపూడి బాబు , సాతులూరి కోటయ్య , కాకి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.







