Thursday, November 7, 2024

నేషనలిస్టు జనశక్తి పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా పట్నాల సాయి కుమార్ నియామకం.:కడియం సూరిబాబు:

నేషనలిస్టు జనశక్తి పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా పట్నాల సాయి కుమార్ నియామకం.

నారదవర్తమానసమాచారం:అమరావతి :ప్రతినిధి: మార్చి 27
సమాజంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అవినీతిని పాలనకు అంతం చెప్పి అంబేద్కర్ ఆశయాలలు ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉన్నత ఆశయాలతో అవినీతి రహిత అత్యున్నత పరిపాలన అందించి అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందించే లక్ష్యంతో సమసమాజ స్థాపన లక్ష్యంగా సమానత్వ సాధనకై సమకాలీన రాజకీయ సంగ్రామంలో సమానత్వం రాజ్యాధికారణ సాధనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార ఫలాలు అందించాలనే లక్ష్యంతో స్థాపించిన నేషనలిస్ట్ జనశక్తి పార్టీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా పట్నాల సాయి కుమార్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవి అందించిన రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అవినీతి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార ఫలాలు అభివృద్ధి ఫలాలు సమానత్వంగా అందించేందుకు సమానత్వ సమాజ స్థాపనకు కుల, మత ప్రాంతాలకు అతీతంగా అవినీతి రహిత అభివృద్ధి సమాజ సాధనకై తన వంతు కృషి చేస్తానని సాయి కుమార్ తెలియజేశారు.స్టేట్ జనరల్ సెక్రెటరీగా సాయి కుమార్ నియమించడం పట్ల వ్యాపారవేత్తలు,నగర ప్రముఖులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు వివిధ రంగాలకు చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading