ఆంద్రప్రదేశ్
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అంబటి
సత్తెనపల్లి,
నారద వర్తమాన సమాచారం:ముప్పాళ్ల:ప్రతినిధి
సత్తెనపల్లి పట్టణం, ముప్పాళ్ళ మండలాల్లో జరిగిన ఇఫ్తార్ విందులలో రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు పాల్గొన్నారు. వేరు, వేరు ప్రాంతాల్లో పాల్గొని ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. పేరుపేరునా పలకరిస్తూ ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ రంజాన్ పవిత్రమైన మాసమని , ఈ మాసంలో ముస్లిం సోదరులు చేస్తున్న ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక చింతనను మెరుగుపరుస్తాయన్నారు . పట్టణంలోని 29వ వార్డులో మార్కెట్ ఖాసిం, ముప్పాళ్ళ మండలంలో హుస్సేన్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ , మండల , నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు , వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు నాయకులు , క్రియాశీలక కార్యకర్తలు , ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.