Thursday, November 21, 2024

వైఎస్సార్సీపీలో చేరిన ఊటుకూరు, హసనాబాద్ వాసులు కండువా కప్పి ఆహ్వానించిన :ఎమ్మెల్యే నంబూరు శంకరరావు:

ఆంద్రప్రదేశ్

నారదవర్తమానసమాచారం:క్రోసూరు:ప్రతినిధి

వైఎస్సార్సీపీలో చేరిన ఊటుకూరు, హసనాబాద్ వాసులు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

క్రోసూరు మండలం ఊటుకూరు, హసనాబాద్ గ్రామానికి చెందిన 10కుటుంబాల వారు ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. క్రోసూరు లోని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు  స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు  మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఊటుకూరు
బంకా శివ, బంక థామస్, బంకా పెద్ద థామస్
హసనాబాద్
గాదం నరసింహారావు, గాదం పేరయ్య, తోకల రామాంజనేయులు, తిరుమల రామాంజనేయులు, వల్లాల పరమేష్, కవ్వల జగన్నాథం కూడా ఎమ్మల్యే  సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading