నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
2024 సాదారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సిద్దం చేసుకోవలసిన వాటిలో ముఖ్యమైనవి.
నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.
క్యాస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
మిమ్మల్ని బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.
మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)
స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.
డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.
ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.