
కోనూరు లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట:ప్రతినిధి:
అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం కోనూరు లో టీడీపీకి చెందిన 11 కుటుంబాల వారు.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ..
ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. మరోసారి తనను ఆదరిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో జూపల్లి శివ నగేష్, వెంకయ్య, ఏసుదాసు, శివ( నాగరాజు), సరోజిని, రోజా, కోటేశ్వరమ్మ, నాగబాబు, సాంబయ్య, గంగాధర్ రావు, సుధాకర్ బాబు తదితరులున్నారు.