![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/03/img-20240329-wa16053997616761943486218.jpg?resize=696%2C392&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/03/img-20240329-wa16048212576727843636325.jpg?resize=696%2C316&ssl=1)
మానవాళికి శాంతిని అనుగ్రహించేందుకే క్రీస్తు ప్రాణత్యాగం.
భక్తిశ్రద్ధలతో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రార్థనా వేడుకల్లో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు.
నారద వర్తమాన సమాచారం: సత్తెనపల్లి :ప్రతినిధి
ప్రపంచ మానవాళికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేందుకే క్రీస్తు ప్రాణత్యాగమని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు.
శుక్రవారం ఎఫ్ సి ఐ మార్గంలో బేతేలు ప్రార్థన మందిరంలో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సంఘ కాపరి ఆండ్రూస్ మాట్లాడుతూ ఈ ప్రార్ధన మందిరం నిర్మాణ సమయంలో హెవీ లైన్ విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటంతో మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఖర్చుతో కూడుకున్న పని అయినా ఆయన సహకారంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉచితంగా తీగల అడ్డు తోలుగేలా మంత్రివర్యులు సహాయం చేశారని ఆయన గుర్తుచేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఇది సహాయం కాదని ఇది మా బాధ్యత అని, ప్రజలు సౌకర్యవంతంగా వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీ ప్రార్థనల్లో మంచి పరిపాలన చేసినందుకు మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, నాయకులు, క్రైస్తవ సోదరులు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.