Friday, November 22, 2024

ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన మహానేత ఎన్టీఆర్నందమూరి ఆశయాలను సాధిస్తాం.

ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన మహానేత ఎన్టీఆర్
నందమూరి ఆశయాలను సాధిస్తాం.

నారద వర్తమాన సమాచార:జి కొండూరు :ప్రతినిధి.

బీజేపీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే వసంత
జి.కొండూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం.
తెదేపా జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన మహా నేత అన్న నందమూరి తారక రామారావు అని బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.
బీజేపీ, జనసేన బలసపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ముందుగా కేకును కట్ చేశారు. అందరూ పంచుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ.
తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు తర్వాత నారా చంద్రబాబునాయుడు ఆయన ఆశయాల సాధన దిశగా యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు.దీనికి నిదర్శనంగా హైదరాబాద్ నగరాన్ని పేర్కొన్నారు. గతంలో దేశంలో ఉన్న 20నగరాల సరసన ఉన్న హైదరాబాద్, నేడు దేశవ్యాప్తంగా 3 నగరాల స్థాయికి చేరిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వెనుక నారా చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉందన్నారు.ముందు చూపుతో చంద్రబాబు నాయుడు చూపిన దార్శనికత వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తెలుగువారు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దివంగత నేత నందమూరి తారక రామారావు ఆశయాలను సాధించడానికి, లక్ష్యాలను చేరుకోవటానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచయాలని పిలుపునిచ్చారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరూ యుద్ధంలో సైనికుల్లా పోరాడి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading