దేవారంపాడు తిరునాళ్ళ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్ .
నారద వర్తమాన సమాచారం:రాజుపాలెం:ప్రతినిధి
రాజుపాలెం మండలం దేవరం పాడు గ్రామంలో వేంచేసిన శ్రీ నేతి వెంకన్న స్వామి వారి తిరునాళ్ళను మూడవ శనివారం కూడా నిర్వహిస్తున్న సందర్భంగా ఆ స్వామి వారిని దర్శించుకున్నఎస్పీ.
(తిరునాళ్ళ మహోత్సవమును 5 శనివారాలు నిర్వహిస్తారన్న విషయం అందరికి విదితమే)
తిరునాళ్ళ సందర్భంగా దేవారంపాడు గ్రామంలో మరియు కొండపై పోలీసుశాఖ తరపున చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన, బందోబస్తు అధికారులు మరియు సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చిన ఎస్పీ భక్తుల భద్రతకు ఎక్కడా భంగం కలగకుండా, వారు స్వేచ్చగా దేవుణ్ణి దర్శించుకుని, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎస్పీ ఎప్పుడో మన పూర్వీకుల కాలం నుండి ఆచారంగా వస్తున్న దేవారంపాడు తిరునాళ్ళలో పాల్గొని, ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా వుందని తెలిపిన ఎస్పీ .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.