- నూతనశాఖను ప్రారంభిస్తున్న ఆర్ఎం సిహెచ్ శ్రీనివాసరావు
రైతులకు మెరుగైన సేవలందిస్తున్న సిజిజిబి
- ఆర్ఎం సిహెచ్ శ్రీనివాసరావు
నారద వర్తమాన సమాచారం :గుంటూరు:ప్రతినిధి:, మార్చి 30 :
రైతులకు చైతన్య గోదావ రి గ్రామీణ బ్యాంక్ (సిజిజిబి) మెరుగైన సేవలంది స్తున్నట్లు ఆర్ఎం సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడుజిల్లా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో శనివారం బ్యాంక్ 265వ శాఖను ఆయన ప్రా రంభిచారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి చీఫ్మేనేజర్ శ్రీనివాస కుమార్ అధ్యక్షత వహించా రు. ఆర్ఎం శ్రీవినాసరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమ బ్యాంకు ఇప్పటివరకు రూ.22 వేల కో ట్ల లావాదేవీలతో రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో ముందున్నట్లు చెప్పారు. ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది అందుబాటులో వుండాలని మాజీ ఎంపిపి గోగినేని కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ రావిపాటి బసవయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పంగా వెంకటేశ్వరరావు, పాలకేంద్రం అధ్యక్షుడు మార్పుల వెంకటరెడ్డి తదితరులు సూచించారు. కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ రాజేష్, విశ్రాంత ప్రధానోపా ధ్యాయులు రావిపాటి తాతయ్య, పంగా హరిబాబు, రావిపాటి దుర్గాభవాని, డిసిఎంయస్ పాలకవర్గ మాజీ సభ్యుడు రావిపాటి కోటేశ్వర రావు, సిజిజిబి మేనేజర్లు కిషన్ (ముప్పాళ్ళ), ఎవి చంద్రశేఖర్ (సత్తెనపల్లి), కందిమళ్ళ సాంబశివ రావు, కంచర్ల నా గేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.