అవిశ్వాసం నెగ్గి చరిత్ర సృష్టించిన రామారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి.
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 01..
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ అవిశ్వాసం నెగ్గిన నా రెడ్డి దశరథ్ రెడ్డి.ఈ సందర్భంగా రామారెడ్డి మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసి, కొత్త జిల్లాలు అలాగే కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రామారెడ్డి కొత్త మండలం ఏర్పడంతో తొలి ఎంపీపీగా నేను గెలవడం జరిగిందని అన్నారు.మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సాకారంతో మండల నాయకుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొంతమంది ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరి నా పైన అవిశ్వాసం పేట్టడం జరిగిందని, మా ఎంపిటిసిలకు వాస్తవాలు చెప్పితే గతంలో ఉద్యమాలు చేసిన వ్యక్తి అని గ్రహించి నాకు రామారెడ్డి మండల ఎంపీటీసీలు మద్దతు తెలిపినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. దీనికి సహకరించిన వివిధ గ్రామాల సర్పంచులకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఏదేమైనా ఆధర్మం పైన ధర్మం గెలిచిన విజయం, ఈ అవిశ్వాసం పైన నేను నేగ్గినందుకు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక్క చెంప పెట్టు లాగా అయిందని అన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాల మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని , ఇట్టి విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని , త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.