నారద వర్తమాన సమాచారం :సతైనపల్లి :ప్రతినిధి
ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి సంక్షేమానికి అండగా ఉండండి
పట్టణ ప్రధాన రహదారి మార్గంలో ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి, మంత్రి అంబటి
వృద్ధులకు, వికలాంగులకు జీవన భరోసా కలగాలన్నా,
భావితరాల భవిష్యత్తు మెరుగుపడాలన్నా, సంక్షేమ రాజ్యం కొనసాగాలన్న ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు, సత్తెనపల్లి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు కోరారు. సోమవారం గజ్జల హాస్పిటల్స్ వద్ద నుండి ఆయన ప్రధాన రహదారిలో నివాసాలు, వ్యాపార దుకాణాలకు కరపత్రాలు అందిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు . అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ రాష్ట్రములో పచ్చ మంద , దుష్ట చతుష్టయం కలిసి వృద్ధులు వికలాంగుల, పించన్ దారులపై కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారన్నారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ నిలిపివేయడంతో కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. వీరందరినీ రోడ్డున పడేసింది చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించారు, ఇది వృద్ధులపై కక్ష సాధింపు కాదని అడిగారు.
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందించానని, రౌడీయిజాన్ని అణిచివేశానని, ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశామని వివరిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలన్న, నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణ రావాలన్నా మీకున్న రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి ఇక్కడ నన్ను , పార్లమెంట్ కు అనిల్ కుమార్ గెలిపించాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో విశేష సంఖ్యలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఉత్సాహంగా అంబటి ఇంటింటికి తిరుగుతున్నారు. నియోజకవర్గ నాయకులు వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.