
నారద వర్తమాన సమాచారం రెడ్డిగూడెం ప్రతినిధి.
కమిషన్లు తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు.
ప్రభుత్వం ఖాజానాలో సొమ్ము లేదు.
అందుకే వృద్ధులకు పింఛన్ సొమ్ము సకాలంలో అందలేదు.
వృద్ధులను ఎండలో తిప్పుతూ పైశాచికానందం పొందుతున్న ఏపీ సర్కార్.
పింఛన్ల పంపిణీపై చంద్రబాబునాయుడుపై దుష్ప్రచారం తగదు.
వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం తగదని ఎప్పుడో ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల కమిషన్.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తాత్సారం చేసిన ప్రభుత్వం.
వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడేస్తున్న వైసీపీ ప్రభుత్వం
జీవిత చరమాంకంలో చివరి దశలో ఉండి ఓపిక లేక ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పై ఆధారపడి బతుకు బండిని లాగుతున్న వృద్ధులను సైతం ఎండలో తిప్పే పరిస్థితి కల్పించి, వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమి మైలవరం నియోజకవర్గం అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆవేదన వ్యక్తం చేశారు.
రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.
వాలంటీర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాబట్టి వారిని ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నికల కమిషన్ 10 రోజుల క్రితమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.
దీనికి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం కావాలని తాత్సారం చేయడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైందన్నారు.
కావాలని రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీని ఆలస్యం చేసి వృద్ధులను ఎండలో తిరిగే పరిస్థితి కల్పించి అవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.
కానీ వాస్తవంలో జరిగేది ఏమిటంటే…
ప్రభుత్వం కాలపరిమితి ముగిసిపోతూ ఉండటంతో కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ ఉందన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి కమిషన్లు తీసుకుని బిల్లులు క్లియర్ చేయటంతో నేడు పింఛన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేదన్నారు.
వాలంటీర్లను మినహాయిస్తే ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ద్వారా ఇప్పటికే 1వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలి. కానీ ప్రభుత్వం ఖజానాలో సొమ్ము లేదు కాబట్టే ఇప్పటివరకు పింఛన్లు పంపిణీ జరగలేదు.
ఈ కారణంతో పింఛన్ల పంపిణీ వాయిదా పడిందన్నారు. కాలయాపన చేసి ప్రజలను అవస్థలు పాలు చేసి, ఇదంతా తెలుగుదేశం పార్టీ మీద,చంద్రబాబు నాయుడు మీద మోపి, దీనివల్ల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ వాస్తవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.