
నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఖరారు
ప్రజాగళం యాత్ర మరోసారి చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపడతారు. ఏప్రిల్ 6న పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఏప్రిల్ 7న పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.