నారద వర్తమాన సమాచారం :సతైనపల్లి : ప్రతినిధి :
సత్తెనపల్లి ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుపడుతా
విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయుల సమావేశంలో జొన్నలగడ్డ
అభివృద్ధిలో స్థానికులైన ఎమ్మెల్యేలు వావిలాల, యర్రం, కోడెల వలే నేను కృషి చేస్తా
అభివృద్ధిని పట్టించుకోని పక్క జిల్లాల స్థానికేతర ఎమ్మెల్యేలు, పోటీదారులు
స్థానికుడు, యువకుడు, విద్యావంతుడైనా నేను సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఉపాధి, ఆత్మగౌరవం కోసం పాటుపడతానని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం సత్తెనపల్లి పెన్షనర్ అసోసియేషన్ హాలులో విశ్రాంత ఉద్యోగులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తెనపల్లికి చెందిన స్థానికులు ఎమ్మెల్యేలుగా గెలిచిన వావిలాల గోపాలకృష్ణ, యర్రం వెంకటేశ్వరరెడ్డి, కోడెల శివప్రసాదరావులు అభివృద్ధి లో నియోజకవర్గ రూపురేఖలు మార్చారన్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన స్థానికేతరులు ఇక్కడికొచ్చి అభివృద్ధిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. నేను స్థానికుడ్ని యువకుడ్ని..విద్యావంతుడ్ని స్థానిక ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసినట్లుగా తాను కూడా చేస్తాను పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నానని కోటు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన కోరారు. రాజ్యాంగమే ప్రామాణికంగా పనిచేస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతికై పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ పార్టీ ని స్థాపించారని తెలిపారు. అనంతరం జొన్నలగడ్డ విజయ్ కుమార్ ను పలువురు విశ్రాంత ఉద్యోగులు దుశ్యాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు రామారావు, విశ్రాంత ఉద్యోగులు కేబీఆర్ జే ప్రసాద్ , మనికే సంగీతారావు, సయ్యద్ జయనుల్లా బీన్, మల్లేశ్వరావు, రంగారెడ్డి, మురహరి, జగన్నద నాయుడు, నాగవర్దన్, పోతులూరయ్య, కృష్ణారావు, సుందర్ సింగ్, నాగేశ్వరరావు, నాసరయ్య పార్టీ నాయకులు మహంకాళి వెంకట్రావ్, దుగ్గి విజయ్ కుమార్, కొరబండి రాబర్ట్, నెలటూరి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.