నారద వర్తమాన సమాచారం :సతైనపల్లి :ప్రతినిధి
ఎన్నికల వేళ వైసీపీలో కొనసాగుతున్న వలసలు
పేదల పక్షాన నిలిచిన జగనన్నకు పెరుగుతున్న ఆదరణ
సొంత గూటికి చేరిన కందులవారిపాలెం కార్యకర్తలు
తెదేపా నుంచి వైసీపీలోకి చేరికలు
సత్తెనపల్లి
సార్వత్రిక ఎన్నికల వేళ కీలకమైన గ్రామాల నుంచి వైయస్సార్సీపి లోకి కొనసాగుతున్న చేరికలు పేదల పక్షాల నిలిచిన జగనన్నకు అండగా ఉన్నారు అనే ధీమాను తెలియజేస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు అన్నారుమ్ శుక్రవారం నియోజకవర్గ కార్యాలయంలో కందులవారి పాలెం గ్రామానికి చెందిన కొందరు కార్యకర్తలు స్థానిక నాయకుల బలవంతంతో గురువారం కన్నా సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు.తిరిగి మంత్రి అంబటి ఆధ్వర్యంలో కొమెర బ్రహ్మయ్య, కొమెర నాగేశ్వరరావు, ఎం నాగరాజు లు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితోపాటు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన ఆచి కోటయ్య, ఆచి చెంచులు, కొమెర అనిల్ లు వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ మంత్రి అంబటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అన్ని సర్వేలు జగన్ కి అనుకూలంగా ఉన్నాయని, ఈ ఐదేళ్లలో పారదర్శకంగా అందించిన సంక్షేమ పథకాలు, సంస్కరణలతో కూడిన పరిపాలనే నిదర్శనమన్నారు. పార్టీలో చేరిన వారు స్థానిక నాయకులతో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వారితో పాటు గ్రామ, మండల నియోజకవర్గ, నాయకులు ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.