నారద వర్తమిన సమాచారం :గిద్దలూరు:ప్రతినిధి
తల్లికి వందనం పథకం ద్వారా యేటా 15 వేల రూపాయలు
7వ రోజు ఇంటింటి ప్రచారంలో ముత్తుముల సతీమణి పుష్పలీల
ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంటిలో చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్న ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేయటం జరుగుతుందని గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల మహిళలకు వివరించారు. గిద్దలూరు పట్టణంలో 7వ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10వార్డులో పోలీస్ స్టేషన్ వీధి, కోటగడ్డ వీధి, అంకాళమ్మ వీధి, శర్మ వీధి, గుర్రెడ్డి కాంప్లెక్స్ వీధుల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వారు టీడీపీ జనసేన బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరులో స్థానికంగా నివాసం ఉండే తమకు మద్దతుగా నిలిచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డి కి, మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. గతంలో శాసనసభ్యులుగా ఉన్న అశోక్ రెడ్డి పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశారని, పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి సంక్షేమం అందించారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలంతా స్థానికంగా నివాసం ఉండే తమకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీజేపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.