నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి :ప్రతినిధి
బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన జగజీవన్ రామ్
రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు
వైయస్సార్సీపి ఆధ్వర్యంలో ఘనంగా బాబూజీ జయంతి వేడుకలు
స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారతదేశ తొలి ఉపప్రధానిగా విశేషమైన సేవలందించి, ఆయన చేపట్టిన ప్రతి శాఖలోనూ సమర్థవంతంగా పనిచేసి, నిరంతరం బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జగజ్జీవన్ రామ్ సేవలు నిరుపమానమని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన జగ్జీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏఎంసి చైర్మన్ బాబురావు, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలక జైపాల్ లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పులతో పాదయాత్రగా అమరావతి బస్టాండ్ సెంటర్లో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు తరలివెళ్ళారు. అక్కడ మహనీయుడు బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్బంగా అంబటి మాట్లాడుతూ గ్రామాల్లో గతంతో పోల్చుకుంటే దళిత సామాజిక వర్గాల్లో ఐక్యత మెరుగుపడిందన్నారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కూడా జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. విద్య, ఆర్థిక , రాజకీయ రంగాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని దళిత వర్గాలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. నియామక పదవుల్లో అత్యధిక భాగం బలహీన వర్గాలకే కేటాయించారని వివరించారు. జగ్జీవన్ స్పూర్తి తో నేటి యువత పనిచేయాలని సూచించారు. అనంతరం పెండెం బాబురావు, చిలకా జైపాల్‌లు నియోజకవర్గంలో అంబటి ఆధ్వర్యంలో దళిత సామాజిక వర్గాలకు ఇచ్చిన అవకాశాలను గురించి వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ , దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ, మండల, నియోజకవర్గ నేతలు, వైయస్సార్సీపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.