నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
చంద్రబాబు నాయుడు సీఎం కావడం చారిత్రక అవసరం.
బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయానికి అందరూ కృషి చేయాలి.
హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు .
మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
నారద వర్తమాన సమాచారం జి. కొండూరు ప్రతిని.
విధ్వంసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చంద్రబాబునాయుడు సీఎం కావడం చారిత్రక అవసరమని, మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
హైదరాబాదులోని వసంత సిటీలో ఎన్నారైలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలుగువారితో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు శాలువాలు కప్పి సత్కరించి, పుష్పగుచ్చాలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే కేపీ ముందుకు సాగారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ. అభివృద్ధికి చోటులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే బాధ కలుగుతుందన్నారు. ఓ పక్క హైదరాబాదు బాగా అభివృద్ధి చెందిందన్నారు. ఇందులో ఎంతోమంది మహనీయుల కృషి ఉన్నప్పటికీ హైదరాబాద్ నగర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పాత్ర కీలకమన్నారు.
కానీ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 జిల్లాలకు మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేసే క్రమంలో 2019లో ప్రభుత్వం మారిందని అన్నారు. ఎన్నికల ముందు అమరావతియే మన రాజధాని అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మాట తప్పాడన్నారు. మడమ తిప్పాడన్నారు. అమరావతి రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి నీరుగార్చారని అన్నారు.
హైదరాబాదులో తనకు వ్యాపారాలు ఉన్నప్పటికీ తన పుట్టిన గడ్డమీద మమకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, తను ప్రజాసేవ చేసేందుకు ప్రవుత్తిగా రాజకీయాలను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.4000 కోట్లు ఖర్చుపెడితే 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం గడచిన 5 ఏళ్లలో కనీసం ఐదు శాతం నిధులు కూడా చేయలేదన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సాగునీటి సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు వారి సమస్యలను చెప్పుకునేందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదన్నారు. మన ప్రాంతం అభివృద్ధికి, రిజర్వాయర్ల ఏర్పాటుకు నిధులివ్వకుండా నేను ఇచ్చిన విజ్ఞాపన పత్రాలన్నిటిని కేవలం ఎండార్స్మెంట్ ఇచ్చి, బుట్టదాఖలు చేశారని అన్నారు.
కేవలం ప్రజలకు తాయిలాలు ఎరగా చూపుతూ పేదలను మభ్యపెట్టి, వారిని ఓట్లను దండుకోవాలని చూడటం ఎంతవరకు సబబుని ప్రశ్నించారు. అభివృద్ధితో కూడిన సంక్షేమంతో పేదల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడతాయన్నారు. ఇది చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు.
మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు, ప్రగతికి, పేద ప్రజల సంక్షేమానికి మహాకూటమి అధికారంలోకి రావాలన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉండేవారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎవరికి వారు చైతన్యవంతులై ఓటర్లను ప్రభావితం చేయాలన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ మహా కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.