నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఎస్సైకి జైలు శిక్ష విధించిన నెల్లూరు కోర్టు
2016లో టీస్టాల్ వద్ద ఒక వ్యక్తిని కొట్టిన ఎస్సై మానవ హక్కులకు భంగం కలిగించారంటూ కేసు నమోదు
6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
బిట్రగుంట ఎస్సై వెంకటరమణకు నెల్లూరు మొదటి అదనపు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తిని కొట్టిన కేసులో వెంకటరమణకు 6 నెలలు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే తనపై ఎస్సై దురుసుగా ప్రవర్తించారంటూ ఓ వ్యక్తి బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను టీ తాగుతుండగా ఎస్సై వెంకటరమణ దౌర్జన్యం చేశారని, అకారణంగా తనను కొట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మానవ హక్కులకు భంగం కలిగించారంటూ ఎస్సైపై కేసు నమోదయింది. ఈ ఘటన 2016 జూన్ 24న బిట్రగుంట లోని టీస్టాల్ వద్ద జరిగింది. తాజాగా ఎస్సై వెంకటరమణకు కోర్టు జైలు శిక్ష విధించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.