నారద వర్తన సమాచారం :ప్రతినిధి
పెదకూరపాడు కి ఐటీ కంపెనీలు తీసుకొస్తానని చెప్పడం హాస్యాస్పదం : వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు
మండల కేంద్రంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా గళం పేరుతో చంద్రబాబు అన్ని అబద్ధాలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని శంకర్రావు అన్నారు. పెదకూరపాడు కి ఐటీ కంపెనీలు తీసుకొస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందో తెలుసుకోకుండా వారు రాసిన స్క్రిప్టు చదవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇసుక పాలసీ అనేది కొన్ని కంపెనీలకు సంవత్సరాల లెక్క టెండర్లు ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయం కల్పించిందని ఇసుక స్థానిక ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన అన్నారు. ఇసుక తీసిన గోతుల్లో 23 మంది మీ ప్రభుత్వం హయాంలోనే చనిపోయారని గుర్తు చేశారు. ఏ మీటింగ్ పెట్టిన ఎక్కడ మీటింగ్ పెట్టిన చెప్పిందే చెప్పడం తప్ప కొత్త విషయాలు మాట్లాడటం చంద్రబాబుకు రాదన్నారు. మీరు వస్తే అమరావతి బెల్లంకొండ రోడ్డు వేయటం ఏంటి? మద్దూరు బ్రిడ్జి కట్టడం ఏంటి ఆల్రెడీ నేను ఎలక్షన్లకు ముందే రోడ్డు ప్రారంభించి పూర్తి చేశాకే ఓటు అడగడానికి వస్తాను అన్నాను అది ప్రారంభించి త్వరలో ఎలక్షన్ అయిపోయిన అనంతరం మేమే బ్రిడ్జిని రోడ్డును ప్రారంభిస్తామని శంకర్ రావు అన్నారు. వయసులో పెద్దవాడి నోటి నుండి వచ్చే మాటల్లో పెద్దరికం లేదని ఒకటైన నిజం చెప్పేవా చంద్రబాబు అని శంకర్రావు అన్నారు. అసలు ఈ రెండు నెలలు ఆగితే అసలు వాళ్లే టిడిపిని లాక్కుంటారని ఆయన అన్నారు. అయినవారికి వెన్నుపోటు పొడవడం నీకు కొత్త ఏమి కాదని అన్నారు ఇక్కడ కష్టపడే నాయకుడు శ్రీధర్ కు వెన్నుపోటు పొడిచి భాష్యం ప్రవీణ్ కి సీట్ ఇచ్చిన ఘనత నీకే దక్కుతుందని ఆయన అన్నారు. డబ్బున్నవాళ్లు ఎన్ఆర్ఐలు తప్ప నీ కళ్ళకు సేవ చేసే వాళ్ళు ఎవరో కనిపించరా అని ప్రశ్నించారు. ఈ రెండు నెలల్లో తప్ప పేడ సర్దుకుని పోయేది నువ్వు మేం కాదని ఆయన అన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం నీ నోట నుండి ఎప్పుడు రాలేదని శంకర్రావు అన్నారు. నేను పార్టీ మారటం ఏంటి భయం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వైసీపీ పార్టీ మేము తెలుగుదేశంలోకి రావటం అంటూ కల నీవు అలాంటి అసత్య ఆరోపణలో ప్రచారాలు మానుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. ప్రజాగుళం అట్టర్ ప్లాప్ అయిందని జన సమీకరణ లేరని అసలు నీ మీటింగ్ అంటే ప్రజలు వచ్చేందుకు అసహనం చూపుతున్నారని చెప్పిందే చెప్పడం తప్ప కొత్త విషయాలు ఏమీ లేవని ఎవరో రాసి వచ్చింది చెప్తే తప్ప నీవు తెలుసుకొని చెప్పింది ఏమీ లేదని ఆయన అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.