నారద వర్తమాన సమాచారం:రాజమండ్రి :ప్రతినిధి
1) నేషనలిస్టు జనశక్తి పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, హక్కులను కాలరాస్తున్న మరియు ఢిల్లీ పెద్దల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్న, వెన్నుముక లేని నాయకత్వాలతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న రాష్ట్రంలోని పాలక మరియు ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా 2024 సార్వాత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను పోటీకి నిలబెట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేషనలిస్టు జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోవడం జరిగినది. అలాగే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజాశ్రేయస్సు తదితర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యన్ జే పి స్టేట్ అదికారప్రతినిధి పొన్నెకంటి శ్రీనివాసాచారి ,పార్టీ ప్రదానకార్యదర్శి మరియు తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు పట్నాల మురళీ , అనాకాపల్లి జిల్లా అద్యక్షులు కొమ్మోజు రమేష్ ,చిట్టూరి సత్యన్నారాయణ మరియు పార్టీ ప్రతినిదులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కడియం సూరిబాబు
రాష్ట్ర అధ్యక్షులు
నేషనలిస్టు జనశక్తి పార్టీ
ఆంధ్రప్రదేశ్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.