నేను ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను.
జి.కొండూరు-దుగ్గిరాలపాడు రోడ్డు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను.
కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించక రోడ్డు అభివృద్ధి నిలిచిపోయింది.
-మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
నారద వర్తమాన సమాచారం జి.కొండూరు ప్రతినిధి.
స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద నుంచి ఎమ్మెల్యేల వరకు ఏమాత్రం విలువలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేక తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
జి.కొండూరు మండలంలోని సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని, దుగ్గిరాలపాడు గ్రామాల్లో బుధవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియాశెట్టి శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ .
మైలవరం నియోజకవర్గంలో నేను ఆశించిన విధంగా అభివృద్ధి చేయలేకపోయానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కలలో రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని సైతం నిర్లక్ష్యం చేశారన్నారు. జి.కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు రహదారి అభివృద్ధికి తను ఎంతో కృషి చేసినప్పటికీ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక రోడ్డు అభివృద్ధి మధ్యలోనే నిలిచిపోయిందన్నారు.
విద్యుత్ బిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదన్నారు. దీని కారణంగా ఏపీలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాకు మళ్లించిందన్నారు. దీనివల్ల గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా ఉండటం తప్ప ఏం చేయలేకపోయారన్నారు.
మైలవరం నియోజకవర్గంలో చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారులకు వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ , ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు.
ముందుగా సున్నంపాడులోని రామాలయంలో సోమవారం దర్శించుకుని సమావేశాలు ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామిశెట్టి రమేష్ ను పరామర్శించారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదుకు ఘనస్వాగతం లభించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.