రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు
నారద వర్తమాన సమాచారం ,
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,
మాజీ ఎమ్మెల్యే మరియు బిఆర్ఎస్ నిజమాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్మూర్ పట్టణంలో గల ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ఆర్మూర్ పట్టణ మైనార్టీ సోదరి సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు దాదాపు ఒక నెల రోజుల ఉపవాస దీక్ష చేసి నిన్న విరమణ చేసి నేడు పండుగ జరుపుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతకుముందు ఈద్గా వద్ద తమ సొంత నిధులతో వారు ఏర్పాట్లు చేసుకునేవారని జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రంజాన్ బక్రీద్ పండుగలా సందర్భంగా వారికి మున్సిపల్ లో ప్రత్యేక నిధులు ఇచ్చి షామ్యానాలు వివిధ ఏర్పాట్లు చేశారని అలాగే మైనారిటీ ఫంక్షనల్ నిర్మించిన విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది జీవన్ అన్న ఒకవేళ గెలిచి ఉంటే ఆర్మూర్లో మూడు ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని వారు అనుకున్నారని తెలియజేశారు .ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల సుధాకర్, అల్జాపూర్ మహేందర్, సుంకరి రవి, శ్యామ్ ,మీరా శ్రావణ్ ఎస్సీ సెల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జన్నపల్లి రంజిత్, ఆర్మూర్ యువజన కమిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్ ,ఆర్మూరు మండల యువజన కమిటీ అధ్యక్షులు క్రాంతికుమార్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.