Friday, December 27, 2024

అధ్యాపకుడు…పాత్రికేయుడు…న్యాయవాది నుంచి అసెంబ్లీ వైపు అడుగులు :జొన్నలగడ్డ :

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

అధ్యాపకుడు…పాత్రికేయుడు…న్యాయవాది నుంచి అసెంబ్లీ వైపు అడుగులు

సంక్షేమం..అభివృద్ధి..ప్రజాస్వామ్యం పరిరక్షణే ధ్యేయంగా జొన్నలగడ్డ విజయ్ కుమార్ పయనం

యువకుడు…స్థానికుడు..విద్యా వంతుడే ప్రచార అస్త్రం.

ప్రచారంలోదూసుకుపోతున్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్.

కళాశాల అధ్యాపకుడు.. పాత్రికేయుడు.. న్యాయవాది నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీ వైపు అడుగులు వేస్తున్నాడు స్థానిక యువ న్యాయవాది. కేవలం రెండు దశాబ్దాల కాలంలో అధ్యాపకుడు నుంచి అసెంబ్లీ వైపు అడుగులు వేసేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నాడు జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, యువ న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. సంక్షేమం…అభివృద్ధి… ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పయనిస్తూ వై నాట్ సత్తెనపల్లి అంటున్నాడు..

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పూర్తితో . పట్టుదలతో  యమ్ ఏ యల్ యల్ బి పూర్తి చేశాడు.సత్తెనపల్లి పట్టణంలోని రాజులకాలనికి చెందిన జొన్నలగడ్డ విజయ్ కుమార్ పదో తరగతి వరకు శరభయ్య హై స్కూల్ లో చదివారు. డిగ్రీ నరసరావుపేట, ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు లో 2002 సంవత్సరంలో ఎంఏ ఎకనామిక్స్ (అర్థశాస్త్రం) పూర్తి చేశారు. అనంతరం సత్తెనపల్లి లో సి యస్ జి యల్ యమ్  జూనియర్ కలశాల్లో అధ్యాపకుడి గా చేరి ఇంటర్ విద్యార్థులకు మూడేళ్లు , ప్రగతి డిగ్రీ కలశాల్లో డిగ్రీ విద్యార్థులకు రెండేళ్లు పాఠాలు చెప్పారు. ఈ నేపధ్యంలో ప్రముఖ పేపర్, ఛానల్ లో (ఈనాడు, ఈటీవీ) పాత్రికేయులు గా అవకాశం రావటంతో సుమారు పన్నెండు సంవత్సరాలు పనిచేశారు. ఒకపక్క పాత్రికేయులు గా కొనసాగుతూనే 2015 ఎల్ ఎల్ బి డిగ్రీ పూర్తి చేసి సత్తెనపల్లి కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు…

జడ శ్రావణ్ కుమార్ పిలుపుతో రాజకీయాల్లోకి

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా బహుజనులు నేటికీ సమాజానికి దూరంగానే దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. బహుజనులకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వం తీసుకొని రావటానికి న్యాయమూర్తి ఉద్యోగం ఇంకా 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ జడ శ్రావణ్ కుమార్ రాజీనామా చేసి జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో యువత రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి అభ్యుదయ భావాలు కలిగిన వారు రాజకీయాలకు రావాలని శ్రావణ్ కుమార్ పిలుపుతో జొన్నలగడ్డ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత నియోజవర్గ కన్వీనర్ గా ఆ తర్వాత అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించి పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న తీరుతో పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమించారు.

బాధితుల తరుపున పోరాటాలు

వైసీపీ..,తెదేపా, జనసేన., భారతీయ జనతా పార్టీ తదితర పార్టీల అభ్యర్థుల కంటే ముందుగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) అధినేత జడ శ్రావణ్ కుమార్ జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఏడాదిన్నార క్రితమే ప్రకటించారు. దింతో అప్పటి నుంచే నియోజకవర్గంలో ఆయన ప్రజా క్షేత్రంలో తిరుగుతూ వారితో మమేకమైయ్యారు.సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి దళిత యువ రైతులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో దళిత యువ రైతుల తరపున పోరాటాలు చేసి ఆ భూమి వారికి ఉండేలా కృషి చేశారు. అదేగ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఆదాయం రావట్లేదంటూ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్నడంతో కాలనీ వాసుల కు అండగా నిలబడి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరవింపజేశారు. సత్తెనపల్లి పట్టణం మూడో వార్డు మాస్టీన్ పేటలో అపరిస్కృతంగా నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లారు.దసరా., బతుకమ్మ దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, ముక్కోటి ఏకాదశి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు..,క్రిస్మస్ పండుగకు పేదలకు శాంత క్లాజ్ వేషధారణలో బహుమతులు అందజేశారు. క్రైస్తవుల శ్రమల దినాల్లో చర్చిలో ప్రేమ విందు తదితర కార్యక్రమాలు నిర్వహించారు… అదేవిధంగా చర్మకారుల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్స్ తెలుసుకునేందుకు వారి చెంతకు వెళ్లి పాదచారుల చెప్పులు కుట్టటం. చిన్నతరహా పరిశ్రమ నిర్వహకులు ఎదుర్కొంటున్నా సమస్యలపై కొలిమిలో మలాట్ కొట్టటం, వెల్డింగ్ షాపులో వెల్డింగ్ పనులు చేశారు. వీధి వ్యాపారులు కొబ్బరి బొండాలు, చెరుకు రసం అల్పాహార, టీ దుకాణాల నిర్వాహకులతో మాటలు కలపటం తో పాటు కల్లు గీత కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

అయ్యప్ప మాల దారులకు ఉదయం బిక్షా ఏర్పాటు, దర్గా లో జరిగిన ప్రత్యేక దువా ఆయన పాల్గొని ప్రార్ధనలు చేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని వర్గాల వారితో కలిసిపోయారు. గుడిలో పూజలు..మసీదు…దర్గా చర్చి ల్లో ప్రార్థనలు.,బతుకమ్మ వేడుకల్లో కోలాట నృత్యం…ఇలా కుల, మతాలకు అతీతంగా ప్రజల్లో మమేకమై ఆధ్యాత్మికతే నా అభి ‘‘మతం’’ అంటూ కలిసిపోతున్నాడు.

బరిలో ఇరువురు మాజీ మంత్రుల నడుమ జొన్నలగడ్డ :


  • తెదేపా సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ., అదేవిధంగా వైకాపా నుంచి తాజా మాజీ మంత్రి అంబటి రాంబాబు పోటీ పడుతున్నారు. వీరిలో కన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి పెదకూరపాడు లో వరసగా నాలుగు సార్లు గెలిచారు. 2009 లో అదే పార్టీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఐదోసారి గెలిచి పలు శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం భాజాపా అధ్యక్షుడుగా కొనసాగి ఇప్పుడు తెదేపా చేరి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నాడు. అంబటి రాంబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి అనంతరం వైకాపా లో చేరి సత్తెనపల్లి నుంచి రెండు సార్లు పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయారు. రెండో సారి గెలిచి మంత్రి అయ్యాడు. ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్నాడు..వీరితో స్థానిక యువ న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ జైభీమ్ రావ్ భారత్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.

స్థానికత… యువకుడు… విద్యావంతుడని ప్రజా సేవకై తొలి అడుగు వేస్తున్నా. నియోజకవర్గంలో పేదలకు తన వంతుగా ఆర్ధిక, న్యాయ సహాయం అందిస్తూ వారికి నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు కోటు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారంలో పరుగులు పెడుతున్నాడు.

మన సత్తెనపల్లి మన జొన్నలగడ్డ లోకల్

సత్తెనపల్లి లో ఇప్పటి వరకు ఎమ్మెల్యే గా పోటీ చేసిన వారు ఇద్దరు ముగ్గురు తప్పా అందరూ బయట నుంచి వచ్చి పోటీ చేసినవారే. గెలిస్తే ఐదేళ్లు ఉంటున్నారు ఆ తరువాత ఈ నియోజకవర్గం మరిచిపోయి తిరిగి ఎన్నిక సమయానికి ఇక్కడికొచ్చి కర్చీఫ్ వేస్తున్నారు… మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచనలు, డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలు, మాన్యవర్ కాన్షిరామ్ అడుగుజాడల్లో నడుస్తున్న నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే చదువుకున్నాను..,ఇక్కడే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సత్తెనపల్లి నియోజకవర్గం గురుంచి అనువు అనువు తెలుసు.. ప్రజలకు నేను సుపరిచితుడినే. ఇక్కడి వారిని అన్న.. తమ్ముడు.. అమ్మ అక్క., బావ.., మామా…చెల్లి,., అవ్వ..తాతా అని పిలుచుకునే స్వాతంత్రం ఉంది. ఈ ప్రాంతంలో సహజ వనరులు, ప్రజలకు వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా అధ్యాపకుడిగా కళాశాలలో వారిని తీర్చిదిద్దాను. అదేవిధంగా సమాజంలో దాగి ఉన్న అనేక రుగ్మతలను అవినీతి నిర్మూలన, ప్రజలను చైతన్య వంతులను చేయడంలో ఒక పాత్రికేయుడిగా తన వంతు కర్తవ్యం నిర్వహించాను. ప్రజలకు సత్వర న్యాయ సహాయం అందించడంలో న్యాయవాదిగా కష్టపడుతూ ఉన్నాను మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక యువ న్యాయవాదికి అవకాశం వచ్చింది..ప్రజా సేవకై తొలి అడుగు వేశాను నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నారు.

స్మశానంలోఎన్నికల ప్రచారం..

ఓటర్ల జాబితాలో అవకతవకలు జాబితా పారదర్శకంగా లేదంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారిలో మార్పు లేకుండా చనిపోయిన వారి పేర్లు సత్తెనపల్లి మండలం ఎన్నాదేవి గ్రామంలో 40 కి పైగా ఉన్నాయి. దీంతో స్మశానంలో సమాధుల వద్దకు వెళ్లి ఒక్కోక్క సమాది పైన కరపత్రాలు ఉంచి తనకు ఓటు వేయాలని ఆత్మలను ఓటు అడిగిన తీరు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ఆకర్షణీయమైన దశ దీవెనల మ్యానిఫెస్టో

ప్రజలకు మెచ్చేల ఆకర్షణ ఏమైనా దశ దీవెనల మేనిఫెస్టో తో ప్రజలు చెంతకు వెళ్తున్నారు. ప్రధానంగా పూలే యువ కెరటం, రాజగృహ, కాన్షిరామ్ భూ పంపిణీ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, సావిత్రిబాయి పూలే విద్యా దీవెన, జస్టిస్ కృష్ణ అయ్యర్ న్యాయం, మాత రమాబాయి సురక్ష, స్వామినాథన్ సేద్యం, డాక్టర్ యల్లాప్రగడ ఆరోగ్య సేవా, ఏపీజే అబ్దుల్ కలాం ప్రజా రవాణా పథకం వంటి మహనీయుల పేర్లతో చక్కని మేనిఫెస్టో ముందుకెళ్తున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading