కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ మీడియా సమావేశం
ఎంపీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 13,
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ..ఎంపీ ఎలక్షన్ల తర్వాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం,
కేటీఆర్ తో పాటు మరికొంత ముఖ్య బిఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయం, అని అన్నారు.కవిత లిక్కర్స్ స్కామ్ తోపాటు మరికొన్ని స్కామ్ లలో భూకంభకోణాలు కూడా బయటపడుతున్నాయి,
బిఆర్ఎస్ పార్టీలో చాలామంది జైలుకు వెళ్తారు ఫోన్ టాపింగ్లలో భార్యాభర్తలు మాటలు వినడం సిగ్గుచేటు, అన్నారు.గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోలీస్ ఉన్నత అధికారుల పర్యవేక్షణలో పోలీసు వాహనాలలో డబ్బులు తరలించడం సిగ్గుచేటు అన్నారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ కనుమరుగువుతుందన్నారు.
10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా రైతులను పట్టించుకోలేదు,
కానీ ఇప్పుడు రైతుల పట్ల మోసలి కన్నీళ్లు కారుస్తుంది,
రైతుల పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారు
షబ్బీర్ అలీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.