నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వేలిని కూడా కదిలించలేరు: ఎమ్మెల్యేనంబూరు శంకరరావు
సీఎం జగన్ పై హత్యాయత్నానికి నిరసనగా క్రోసూరులో ర్యాలీ
సీఎం జగన్ ను ఓడించేందుకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా ఆయన చిటికెన వేలిని కూడా కదిలించలేరని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా క్రోసూరులో వైఎస్సార్సీపా నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించారు.పేదలకు మంచి చేస్తున్న జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా.. ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయం అన్నారు. ప్రజలకు సీఎం జగన్ చేసిన మంచి, పాలనలో చూపించిన నిజాయితీ ఆయనకు ఎప్పుడూ అండగా ఉంటాయన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు కళ్లు తెరుచుకొని.. దమ్ముంటే వాళ్లు చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని హితవు పలికారు. కుట్ర రాజకీయాలకు ప్రజలు మే 13న ఓట్లతో సమాధానం చెప్పబోతున్నారన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.