నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
మానవ హక్కుల ప్రదాత బి. ఆర్. అంబేద్కర్
ఏపీ జి ఈ ఏ క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్
స్వతంత్ర భారతదేశంలో మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకార ము చేసిన మహోన్నతుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ శ్లాఘించారు.
బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు లోని పి హెచ్ సిదగ్గర అంబేద్కర్ విగ్రహానికిఆదివారం పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మానవ హక్కుల ప్రదాత గా డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు లో కీర్తింపబడుతున్నారని అన్నారు బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురి అయి, పేదరికం ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహా మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం ఉంటుందని పేర్కొన్నారు దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడాయన అని తెలియజేశారు మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకోసం దేవుని మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధార పడవద్దు అని ఆయన అన్నారని తెలియజేశారు అంబేద్కర్ ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి, ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికే కాక భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని శాంసన్ కొనియాడారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.