నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
తెదేపాను రాజకీయంగా భూస్థాపితం చేస్తాం
ముఖ్యమంత్రి పై దాడికి ఆ ముగ్గురిదే బాధ్యత
దమ్ముంటే బ్యాలెట్ ద్వారా ఎదుర్కోండి
జగన్పై దాడిని ఖండిస్తూ అంబటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
సత్తెనపల్లి
విజయవాడ నడిబొడ్డులో శనివారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాళ్ల దాడికి చంద్రబాబు నాయుడు, లోకేష్ , పవన్ లదే బాధ్యతని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కచ్చితంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం నియోజకవర్గ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని తెలిసే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు హింసను ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి రాలేనని ఫ్రస్టేషన్ లోనే రాళ్ల దాడి చేయించారని విమర్శించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది దుర్దినం అన్నారు. ప్రశాంతంగా, అప్రతిహతంగా జరుగుతున్న మేమంతా సిద్ధం యాత్ర కు ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. ఏ జిల్లా కి వెళ్లినా జగన్ కు ప్రజాదరణ మెరుగు పడుతూనే ఉందన్నారు. ఇది చూసి ఓర్వలేక కూటమి ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ముందుగా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, కార్యాలయం నుంచి తాలూకా సెంటర్ కు వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గడియార స్తంభం మీదగా తిరిగి ర్యాలీ కార్యాలయానికి చేరింది. ఈ ర్యాలీలో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, ఎఎంసి చైర్మన్ పెండెం బాబురావు, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలకా జైపాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రేణులు కార్యకర్తలు జై జగన్ జై జగన్ అంటూ నినదించారు. డౌన్ డౌన్ చంద్రబాబునాయుడు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.మున్సిపల్ నాయకులు చలంచర్ల సాంబశివరావు, వైయస్సార్ సిపి పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి, పూర్వ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి , స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు వైయస్సార్సీపి అనుబంధ మలక సంఘాల నేతలు తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.