నూతన వైస్ ఛాన్సలర్ ల నియామకం తర్వాతనే బి.ఎడ్ కళాశాలల తనిఖీలను చేపట్టాలి…
యూనివర్సిటీ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం…
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు…
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 14,
తెలంగాణ యూనివర్సిటీ దేశంలోనే అత్యంత అవినీతి పరమైన యూనివర్సిటీలలో ముందంజలో నిలిచిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ఆరోపించారు.2006వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తే అభివృద్ధి ఏమో కానీ అవినీతి మాత్రం జరుగుతుందని అన్నారు.
ఈ నెల 18 నుండి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ బి.ఎడ్ కళాశాలలకు తనిఖీలను నిర్వహిస్తామని పేర్కొనడం జరిగిందని వెంటనే ఈ తనిఖీలను ఆపివేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు డిమాండ్ చేశారు.
గత సంవత్సరం తనిఖీలు చేసి అక్రమాలకు పాల్పడ్డా కళాశాల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని,ఇప్పుడు తనిఖీలు చేసి ఏమి చేస్తారని అన్నారు. బోధన్ పట్టణంలోని శ్రీ చైతన్య,సెయింట్ థామస్ కళాశాలలో 32 మంది అధ్యాపకులకు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారని ఈ కళాశాలపై గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అనుబంధ గుర్తింపును ఇవ్వడం జరిగిందన్నారు.ఈ రెండు కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ను పొందుతూ అధ్యాపకులు లేకుండానే కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.గత ఈసీ మీటింగ్ లలో తప్పులు చేసిన యూనివర్సిటీ అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నప్పటికీ ఏ ఒక్కరి పైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవడం జరగలేదని,కొత్త వైస్ ఛాన్సలర్ లు వచ్చేవరకు ఎలాంటి తనిఖీలను చేయకూడదన్నారు ఇదే విషయమై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు అంజల్ రెడ్డి రాజు నవీన్ సందీప్ సతీష్ మహేష్ లు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.