Thursday, November 7, 2024

ప్రతి అడుగు ప్రజల కోసమే.ప్రతి మాట పేదల సంక్షేమం కోసమే.

ప్రతి అడుగు ప్రజల కోసమే.ప్రతి మాట పేదల సంక్షేమం కోసమే.

ప్రతి ఆలోచన మైలవరం నియోజకవర్గ ప్రగతి కోసమే.

నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రెండవ రోజు ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు , బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల) , జనసేన నాయకులు, వీర మహిళా కూడా పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు నేరుగా అందజేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది. ఎంతో ఆప్యాయంగా అందర్నీ పలకరిస్తూ ఆయన పర్యటన కొనసాగింది. అదే రీతిలో తిరిగి స్పందిస్తూ ప్రజలు ధరహాసంతో ఆయన ఇచ్చిన కరపత్రాలను స్వీకరించారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రతి నెలా రూ.10వేలు, 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ.15వందలు ఖాతాలో జమ చేస్తారన్నారు. అలాగే ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులోఉచిత ప్రయాణం కల్పిస్తారన్నారు. అమ్మకు వందనం పథకం ద్వారా ఇంట్లో చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15వేలు లబ్ధి చేకూరుస్తారని తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద యేడాదికి రూ.20వేలు అందిస్తారని వివరించారు. నిరుద్యోగ భృతి, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ ద్వారా పేదలను సంపన్నులుగా చేసేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading