ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, ప్రజల్లో మార్పు కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మహాదేవ ఆలయ పీఠాధిపతి మహదేవ్ స్వామీజీ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 14,
ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, ప్రజల్లో మార్పు కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ మహాదేవ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు లేరన్నారు. నాయకుల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి లేదన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో చూపిన ఆస్తులకు తర్వాత సంపాదించే ఆస్తులపై విచారణ జరిగి నాయకులను శిక్షించే చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. ఆధ్యాత్మికం ద్వారా ఇప్పటికే ప్రజల్లో ఉన్నానని, ఇకపై ధర్మ పాలన కోసం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని తెలిపారు.డా. బీఆర్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదవాడు ఒక్కరైనా ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారా అని ప్రశ్నించారు. అలాంటి వారికి అవకాశం ఇచ్చారా.. అని నిలదీశారు. జాహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే లైన్ లేదని, విద్య, వైద్యం అందడం లేదని, నిరుద్యోగం ఎక్కువవుతోందన్నారు.
తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.