నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
వైఎస్సార్సీపీలో చేరిన ధరణికోట టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన నంబూరు వసంతకుమారి
అమరావతి మండలంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు రోజురోజుకీ పెరుగుతన్నాయి. టీడీపీకి చెందిన 20 కుటుంబాల వారు ఇవాళ వైఎస్సార్సీపీలో చేరారు. పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు సతీమణి నంబూరువసంతకుమారి స్వయంగా కంబువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గత ఐదేళ్లలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చేసిన అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమం నచ్చి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారన్నారు. మరోసారి శంకరరావు ని ఆదరించి ఆశీర్వదిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా మారుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో షేక్ యాసిన్,నజీనా,బరిమ్,రహిముం, జమీల, మహమ్మద్ ఖాసిం, సయ్యద్ జాన్ పీరా, జహీరా, రెహానా, ఆసియా, జాన్ సైదా, జానీ బేగం, రబ్బాని, అరిఫ్, మాబు సుభాని, బీబీ, షాభాషి, జాంబీ,షాహీడున్, జాన్ సైదా,షాజది,షాబుద్దిన్, ముస్తఫా, రిజ్వానా, షేక్ మున్ని, షారూఖ్, షాహంషన్, అబ్దుల్ రఫ్ షాహినా,తస్లీమ్, సత్యం తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.