జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 14,
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి మాట్లాడుతూ… భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పిఅని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రిజర్వు ఇన్స్పెక్టర్ శేఖర్, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.