డీసీఎం లో అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టివేత.
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఖమ్మం జిల్లా నుండి డీసీఎం లో అక్రమంగా తరలిస్తున్న గోవులను గోరక్షకులు,
గ్రామస్తులు కలిసి పట్టుకున్న సంఘటన పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ జియాగూడకు చెందిన అజీమ్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లాలోని బంజారా సంతలో 24 ఎద్దులు రెండు ఆవులను జియాగూడా లోని కబేళాకు తరలించేందుకు బానావత్ అశోక్ అనే వ్యక్తి డీసీఎం మాట్లాడుకొని ఖమ్మం జిల్లా నుండి బయలుదేరిన డిసిఎం హైవే పైన కాకుండా చిట్యాల వలిగొండ మీదుగా పోచంపల్లి మండలంలోని జూలూరు వెళ్లే మార్గంలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరింది. దీనికి అశ్రపుద్దీన్ అనే వ్యక్తి ముందు కార్లో వెళ్తూ మార్గం చూపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పిల్లాయిపల్లి జగత్ పల్లి మార్గమధ్యలోని రోడ్డు పక్కన ఉన్న కాలువ లో ఒక్కసారిగా వాహనం పక్కకు జరిగి కాలువలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోగా డీసీఎం పూర్తిగా ఒకవైపు ఒరిగిపోవడంతో
అశ్రహుద్దీన్ వెంటనే క్రేన్లు తెప్పించే ఏర్పాటు చేశారు. కాగా క్రేన్ రావడం ఆలస్యం అవ్వడంతో తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో డీసీఎం కాలువల నుండి తీయడం జరిగింది. సమాచారం అందించడంతో గోరక్ష మరియు గ్రామస్తులు డీసీఎం కోసం పిల్లాయిపల్లి గ్రామం నుండి వస్తుందని ఎదురు చూశారు. ఈలోగా ఎదురుగా వస్తున్న కారు, డీసీఎంని ఆటో అడ్డంపెట్టి ఆపి పోలీసులకు సమాచారం అందించారు. డీసీఎం మరియు కారు క్రేన్ని కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎస్సై భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని పశువులను స్థానిక జియాగూడ లోని గోరక్ష కేంద్రంలో వదిలిపెట్టారు. నీరు ఆహారం లేక రెండు ఆవులు అక్కడే చనిపోయాయి. అనంతరం స్టేషన్ కి చేరుకున్న భారతీయ జనతా పార్టీ గోరక్ష గల సభ్యులు అక్రమంగా గోవులు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి పత్రాన్ని అందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యన్నం శివకుమార్, గోరక్ష ప్రముక్ బల్ల దుర్వాసులు, జిల్లా బజరంగ్ దళ్ సహసంయోజక్ ఇడం సాయికృష్ణ, బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు సాహెష్, గో రక్షక్ పవన్, సోను సింగ్, శివాజీ, నరేందర్, బడుగు శ్రీకాంత్, చిట్టి మల్ల ప్రవీణ్, కస్తూరి అనిల్, ఏల శీను, చెరుకు వెంకట్, తండా రమేష్, మరియు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్, హిందు వాహిని, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.