
ఎం. జె .ఎఫ్ అవార్డు అందుకున్న లయన్ నివేదన గుజరాతి
. నారద వర్తమాన సమాచారం,
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,16.
ఆర్మూర్ కి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ కు 86 వెయ్యిలు ( 1000 డాలర్లు) విరాళంగా ఇచ్చినందుకు 320 డి. జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ లక్ష్మి ప్రశంస పత్రము మరియు అవార్డు ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం హైద్రాబాద్ లోనీ కేవిఆర్ కన్వెన్షన్ లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 D జిల్లా ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లో ప్రతి సభ్యుడు ఇచ్చే విరాళాలు ప్రపంచ వ్యాప్తంగా నిరుపేద ప్రజలకు ఆయా అవసరాలకు స్వచ్ఛందంగా ఉపయోగపడతాయని వారు కొనియాడారు ఇట్టి అంతర్జాతీయ లయన్స్ క్లబ్ లో సామాజిక సేవలు చేయడానికి సభ్యులు సభ్యత్వం తీసుకోవాలని వారు కోరినారు ఇట్టి కార్యక్రమంలో గ్రీన్ అధ్యక్షులు జెంటిల్ కిడ్స్ ప్రకాష్ కార్యదర్శి రాజేష్, కోశాధికారి కుంటాల నరేందర్ ప్రతినిధులు డీకే రాజేష్,చేపూర్ గనేశ్, ఆకుల రాజు స్వామి,శ్రీనివాస్, కృష్ణ దొండి తదితరులు పాల్గొన్నారు.