నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
బస్సు ప్రయాణాన్ని పేదలకు దూరం చేసిన పెత్తందారు జగన్ రెడ్డి: ప్రత్తిపాటి
ఎన్నికల శంఖారావం, సూపర్ సిక్స్ పథకాలపై ప్రత్తిపాటి ప్రచారం
అందుబాటు ధరలో ప్రజారవాణను అందించే బస్సు ప్రయాణాన్ని ప్రజలకు దూరం చేసిన పెత్తందారు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. 3సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 2వేల కోట్ల భారం వేయడమే కాక గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసి ఘనుడు జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. చిలకలూరిపేట 36, 37 వార్డుల్లో తెలుగుదేశం ఎన్నికల శంఖారావం, సూపర్ సిక్స్ పథకాలపై ప్రత్తిపాటి పుల్లారావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచార చిత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు అత్యంత ప్రభావితమై, కోలుకోలేని విధంగా దెబ్బతిన్న రంగాల్లో ప్రజారవాణ ఒకటన్నారు. ఛార్జీల పెంపురూపంలో ప్రజ లపై భారీస్థాయిలో బండ వేయడమే కాక డొక్కు బస్సులతో ఎంతోమంది ప్రాణాలు తీశారని ధ్వ జమెత్తారు. గడిచిన అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు, రోడ్లపై మొరాయించిన బస్సుల దైన్యమే అందుకు సాక్ష్యమన్నారు ప్రత్తిపాటి. ఇదే సమయంలో దశాబ్దాలుగా ఉన్న అనేక పల్లెవెలుగుబస్సులను రద్దు చేసి గ్రామీణ ప్రాంత ప్రజల్ని బలవంతంగా ప్రైవేటు రవాణ వైపు నెట్టారన్నారు. ఈ కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదలతో అల్లాడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు ప్రత్తిపాటి. కూటమి ప్రభుత్వం రాగానే ఈ విషయంపై కూడా దృస్టి సారిస్తామన్న ఆయన ప్రజలందరికీ ప్రజారవాణ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.