![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240418-wa06204438746627402040076-1-1024x682.jpg?resize=696%2C464&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240418-wa06142272918980122644362-1-682x1024.jpg?resize=682%2C1024&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240418-wa06213183011373160254973-1-1024x682.jpg?resize=696%2C464&ssl=1)
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
జోరుగా ఎన్నికల ప్రచారం.
అడుగడుగున అశేష ప్రజాదరణ
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డిపురం, జయంతిరాంపురం గ్రామాల్లో నేడు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొని, ప్రతి ఇంటికి వెళ్లి, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమం ను, వినుకొండ నియోజకవర్గంలోని జరిగిన అభివృద్ధి ని వివరిస్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బొల్లాపల్లి మండలం అంటేనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని, ప్రతి గ్రామం లోనూ స్వాగతిస్తున్న ప్రజాభిమానం ను చూస్తుంటే రానున్న ఎన్నికల్లో మనం భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు సూచనలుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రివర్యులు అందిస్తున్న సంక్షేమం ప్రతి పేదవారికి ఎంతో మేలు జరుతుందని, ఆ మేలు ను ప్రజలందరి ఆనందం లో కనపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ, చిన్న పెద్ద అని తేడా లేకుండా అర్హులైన వారందరికీ వాలంటీయర్ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముందుకే తీసుకొచ్చి సంక్షేమాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.