నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
టిడిపి ది దుర్మాగపు ఆలోచన
వినుకొండ పట్టణంలోని 14వ వార్డు లో ఎన్నికల ప్రచారం ను నిర్వహించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమంను వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ కి అండగా నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టిడిపి నాయకులు దుర్మాగపు ఆలోచనలు చేస్తున్నారని, మంచి నీటి సమస్య ను తీర్చేందుకు సింగర చెరువు కు నీరు పెడుతుంటే, రాత్రి సమయం లో వాల్ తిప్పి నీటిని వృథా గా పోనిస్తూ, పేదవాల్లకి నీరు ఇవ్వకూడదనే ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. గతం లో ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, కొన్ని వందల కోట్ల దోచుకున్న టిడిపి దొంగలకి, ఇప్పుడు ఇంటి ఇంటికి నీరు ఇస్తుంటే చూసి ఓర్వలేక పోతున్నారు. దోచుకోవటం అలవాటు అయిన వారికి ఇప్పడు కూడా దోచుకోవాలనే దొంగ బుద్దులు బయటపడుతున్నాయని వారికి మీ ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, నా కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు నీరు లేని వినుకొండ ను చూడలేని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఆ దేవుని దయ, మీ అందరి చల్లి ని దీవెనలతో ఎప్పుడూ మీకు మంచి చేయటానికి ప్రయత్నిస్తానని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.