అనుమతి లేని శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ ను మూసివేయాలి
పి డి ఎస్ యు రాష్ట్ర కోశాధికారి జి సురేష్.
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 18,
జిల్లా కేంద్రంలో పి డి ఎస్ యు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర కోశాధికారి జి సురేష్ మాట్లాడుతూ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థుల పరీక్షలు ముగియడంతో అలాంటి విద్యార్థులకు వలవేయడానికి కొన్ని ఎంసెట్ కోచింగ్ సెంటర్లు పుట్టుకు వచ్చాయి అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాల ఎదురుగా గల కమర్షియల్ బిల్డింగులో ఎలాంటి అనుమతి లేకుండా శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ ను ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్ గతంలో డిఎస్పి కార్యాలయం ఎదురు కాలనీలో ఉండేది అక్కడనుండి ఎలాంటి షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఇక్కడికి మార్చడం జరిగింది విద్యార్థి సంఘ నాయకులు వెళ్లి కోచింగ్ సెంటర్ యాజమాన్యం తొ మాట్లాడగా మీకు పర్మిషన్ ఉందా అని అడిగితే లేదు అప్లై చేశాము అని చెప్తున్నారు. షిఫ్టింగ్ పర్మిషన్ ఉందా అని అడిగితే లేదు అని చెప్తున్నారు మరో ఇరవై రోజులు అయితే విద్యార్థులకు క్లాసులు కూడా పూర్తి అవుతాయి ఈ కోచింగ్ సెంటర్ లో మ్యాస్, కెమిస్ట్రీ ఇద్దరు లెక్చరర్ల తోనే నడిపిస్తున్నారు ఫిజిక్స్ లెక్చరర్ కోసం మాట్లాడుతున్నాము త్వరలో వస్తాడు అని చెప్తున్నారు ఈ కోచింగ్ సెంటర్ కు సంబంధించి ఫీజు నియమ నిబంధనలు లేకుండా
వేలది రూపాయలువిద్యార్థుల నుండి తీసుకుంటూనే చాలా నష్టం వస్తుందని యాజమాన్యం చెప్తున్నారు. మేము అనుకున్నంత విద్యార్థులు రాలేరనే విషయం కూడా చెప్తున్నారు అంటే ఈ యొక్క కోచింగ్ సెంటర్ లాభాల కోసమే కానీ విద్యార్థులు యొక్క శ్రేయస్సు కోసం కాదని వారి యొక్క మాటల్లోనే అర్థమవుతోంది వీరికి లాభాలు లేవని కోచింగ్ సెంటర్ ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యాశాఖ అధికారులు ఇలాంటి కోచింగ్ సెంటర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కోచింగ్ సెంటర్ ను మూసివేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలాజీ, రవి, అఖిల్ ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.