

కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గడ్డం ఇందుప్రియ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 19,
కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్గా గడ్డం ఇందుప్రియ తన పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందుగా మంగళ హారతులతో వేద పండితులు, ఫాస్టర్స్, మోల్ సాబ్ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో పదవి బాధ్యతలను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మున్సిపల్ కార్యాలయంలో చేపట్టారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ను కౌన్సిలర్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువలు బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ చైర్మన్ పదవికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్త పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, కౌన్సిలర్లు అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినందుకు ఇందుప్రియకు ప్రత్యేక అభినందనలు తెలిపారు .ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అప్పుడే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ మండలల అధ్యక్షులు పాల్గొన్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.