
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
సత్యవేడు ఎమ్మెల్యే బరిలో నిలవనున్న మాజీ ఎమ్మెల్యే హేమలత మనవరాలు సింధియా
సత్యవేడులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సింధియా
సత్యవేడు ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ ను అధిష్టానం ప్రకటించి ఇంఛార్జిగా నియమించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లుపాటు పార్టీ కోసం కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పనిచేసిన ఆమెకు టికెట్ ను చివరి నిమిషంలో నిరాకరించి ఎమ్మెల్యే ఆదిమూలం కు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు కార్యకర్తల్లో అసహనం ఆగ్రహానికి కారణమైంది.
ఆదిమూలంకు టికెట్ ఇస్తే పని చేయబోమని టీడీపీ నాయకులు బహిరంగంగా ధర్నా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే హేమలతతో పాటు ఆమె మనవరాలు సింధియా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం








