నారద వర్తమాన సమాచారం
కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం:ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలోఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఓర్వకల్లు మండలం పూడి చెర్లమెట్ట వద్ద కల్వర్టును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసులుతో పాటు.. ప్రయాణికుడు రాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణ మని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.