న్యాయం చేయాలని ప్లాట్ల యజమానుల వినతి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన తమ స్థలాల్లోకి కొందరు వ్యక్తులు వచ్చి తమ భూమి అని కడీలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిప్యూటీ తహసిల్దార్ నాగేశ్వరరావు శనివారం వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దేశ్ ముఖి గ్రామంలోని 1, 9 సర్వే నెంబర్లలో దాదాపు 20 ఏళ్ల క్రితం చేసిన వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కానీ కొందరు వ్యక్తులు తమకు పాస్ పుస్తకాలు ఉన్నాయని ఈ స్థలం మాదే అని ప్లాట్ల కడీలను ధ్వంసం చేశారన్నారు. సమగ్ర విచారణ చేయకుండానే ప్లాట్ల స్థలాల్లో మంజూరు చేసిన పాస్ పుస్తకాలను రద్దు చేయాలన్నారు. అక్రమంగా పాస్ బుక్ మంజూరు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు చిల్లర జంగయ్య, దుర్గం నరేష్, దుర్గం రాజు, గుండాల రాజారాం, నూకల అశోక్ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.