
దేశంలో సుస్థిర పాలన కొనసాగాలంటే మళ్ళీ భాజపా అధికారంలోకి రావాలి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
దేశంలో సుస్థిర పాలన కొనసాగాలంటే మళ్ళీ భాజపా అధికారంలోకి రావాలని భాజపా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. పట్టణ కేంద్రంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యకర్తలు నాయకులు భాజపా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. భువనగిరి జిల్లాపై మొదటిసారిగా భాజపా జెండా ఎగరడం ఖాయమన్నారు. మండల పరిధిలోని శివారెడ్డి గూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. కార్యక్రమంలో పడమటి జగన్ మోహన్ రెడ్డి, ఎల్లం శివకుమార్, చిక్క కృష్ణ, నోముల గణేష్, గుండ్ల రాజు పాల్గొన్నారు.