Thursday, November 7, 2024

పేదల పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ. :బొల్లా బ్రహ్మనాయుడు

నారద వర్తమాన సమాచారం

పేదల పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం, సంగినీటిపాలెం, నాయుడుపాలెం, సీతారాంపురం తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వినుకొండ శాసనసభ్యులు  బొల్లా బ్రహ్మనాయుడు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలంరి సంక్షేమం కోరే పేదల పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్టీ అని, బడుగు బలహీన వర్గాల వారందరి పార్టీ జగన్మోహన్ రెడ్డి  పార్టీ అని అన్నారు. అందుకనే నవరత్న పథకాల ద్వారా పేదలందరికీ సంక్షేమం అందిస్తూ, వారింటి పెద్ద కొడుకు గా జగన్మోహనరెడ్డి  మారాలని ఆయన అన్నారు. కుల, మత పార్టీ బేదాలు లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమం అందించామని, తెలుగుదేశం పార్టీ వారు ఆలోచన చేయండి మీ జన్మభూమి కమిటీల లాగా మెఖాలు చూసి పార్టీ లను చూసి సంక్షేమం అందించే పద్దతి మాదికాదని అన్నారు. పూటకో పార్టీ తో జతకట్టే బాబు ను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరం కొద్దీ రంగులు మార్చే ఊసరవెల్లి చంద్రబాబు అని అన్నారు. ఒకప్పుడు మోడిని, పవన్ కళ్యాణ్ ను అనరాని మాటలు అని ఇప్పుడు వారి చెంతన చేరి వారి పొత్తు లో కలిసి వస్తున్నాడు చంద్రబాబు, కుల మతాలను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేసేది చంద్రబాబు అని అన్నారు. ప్రజలు ఆలోచించాలి, శాంతియుతంగా మెలగాలని, బెదిరింపులకు గురి చేసే ఉద్దేశం ఉంటే మానుకుంటే మంచిదని సూచించారు. పల్లెల్లో శాంతియుతంగా మెలగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading