నారద వర్తమాన సమాచారం
వచ్చే ఐదేళ్లలో పల్నాట సాధించుకోవాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది
పనిచేసే నాయకున్ని గుర్తించి గెలిపించుకోండి
గ్రామాల్లో అందరూ ఏకతాటి పైకి వస్తేనే అత్యధిక మెజార్టీ సాధించవచ్చు
అభివృద్ధి,సంక్షేమం రెండు చక్రాల్లా నడవాలంటే బాబు రావాల్సిందే
చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
వచ్చే ఐదేళ్లలో పల్నాడులో సాధించుకోవాల్సిన అభివృద్ధి ఎంతో ఉందని.. ఉమ్మడి కూటమి లావు శ్రీకృష్ణదేవరాయలు , సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని..
దీపాలదిన్నె పాలెం, గుజ్జర్ల పూడి,
భట్లూరు,
గోరంట్ల,
కట్టమూరు కట్టమూరు గ్రామాల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తో కలిసి రెంటపాళ్లలో ప్రచారంలో పాల్గొన్నారు. నిజంగా పనిచేసే నాయకుడిని గుర్తించి ప్రజలు గెలిపించుకోవాలని తెలిపారు. గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న వర్గాలను పక్కనపెట్టి అందరూ ఏకతాటి పైకి వస్తే.. గెలుపుతో పాటు అత్యధిక మెజార్టీని సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి అంటే ఎప్పుడో ఒకసారి ప్రచారం నిర్వహించవచ్చు.. కానీ నేను అలా కాకుండా ప్రజలకు మంచి చేయాలని పరితపిస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని అన్నారు. గతంలో పథకాల ద్వారా ప్రజలకి డబ్బులు అందినప్పటికీ, నిత్యం పెరిగిన ధరలతో ప్రజల నడ్డి విరిగిందన్నారు.
పల్నాడులో రైతుల నీటి కష్టాలు తీరాలంటే సాగర్ కుడికాలవకి గోదావరి జలాలను తెచ్చుకోవాలి, ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే బాబు అధికారంలోకి రావాల్సిందే అన్నారు. యువతకు ఉపాధి దక్కాలన్నా, ప్రజల జీవనోపాధి మెరుగుపడాలన్నా చంద్రబాబు పాలనలోనే జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంచి జరిగేలా పథకాలను తీసుకొస్తున్నట్లు చెప్పారు.
స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అంబటి రాంబాబు మాపై విమర్శలు చేయడం తగదని, మీరు ఎన్ని విమర్శలు చేసినా మేము ప్రజల కోసం పనిచేస్తామని ముక్తకంఠంతో గర్జించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.