నారద వర్తమాన సమాచారం
గాజు గ్లాస్ సింబల్ కోసం పోటాపోటీ
నిమ్మరాజు చలపతిరావు
దాదాపు దశాబ్దాల క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ ఎన్నికల సింబల్ పై విస్తృత ప్రచారం కానిస్తూ వచ్చారు. అయితే భారత ఎన్నికల సంఘం ఆ గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించడం తో పోటాపోటీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు జనసేన అభ్యర్థులు ఉన్నచోట వారికే ఆ సింబల్ కేటాయించాలన్న తీర్పు ఇవ్వటం కొంతమేర ఊరట కలిగించినా…… ప్రస్తుతం ఆ పార్టీ కంటే కూటమిలోని బిజెపి టిడిపిని మాత్రం వనికిస్తున్నది.
జనసేన రెండు పార్లమెంటు, 27 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తున్నది. ఇక మిగిలిన 23 పార్లమెంటు, 148 అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యర్థులు గాజు గ్లాసు గుర్తులు కోరుకుంటే వైకాపా వ్యతిరేక ఓట్లను భారీగానే కోల్పోతామన్న భయం వారిని వెంటాడుతూ ఉన్నది. సాధారణంగా ప్రతి ఎన్నికల్లోను ప్రధాన పక్షాల అభ్యర్థులు రకరకాల పాసుల కోసం తమ సొంత వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పరిస్థితుల్లో కూటమి ఇతర పక్షాలు తమ బినామీలకు గాజు గ్లాస్ గుర్తులు కేటాయింప చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. కూటమి అభ్యర్థులు ఈ అంశంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.